Monday 30 May 2022

ప్రేమ పెళ్లి

తెల తెల తెల్లగా తెలవారుతున్న సమయం !

రెండు రోజుల క్రితం, పెళ్లి చేసుకున్న జంట.. చక్కగా బయలుదేరి, వాళ్లతో పాటు తీసుకెళ్ల వలసిన వన్నీ సర్దుకుంటున్నారు. ఇల్లు అవటం వల్ల అబ్బాయి తరపు వాళ్ళకి చేయాల్సిన మర్యాదలు అన్ని మరచిపోకుండా

Wednesday 7 November 2018

స్వప్నం

గుండెలోకి తొంగిచూసి
నిద్దరోయిన మనసుని తట్టిలేపి
జోలపాడి, ఊయలూపి ..
కళ్ళు తెరిచేంతలోన, మాయమైతివా నా స్వప్నమా !!

# రామ్..

కనుపాప

వర్షాన్ని కంటిరెప్ప ఆపగలదేమో, తన కనుపాపని తడవనివ్వకుండా
ఆ కనుపాపే తనలో ఉన్న సముద్రంలో మునుగుతుంటే,
 ఆపేదెవరు ? కాపాడి బయటకు లాగేదెవరు ?

# రామ్..

పరిచయం

నన్నే నాకు కొత్తగా పరిచయం చేశావే, నా ప్రేమ
ఈ కొత్త నేను నాకు చాలా బాగా నచ్చింది
ఇంకేముందే నాలో, నాకే తెలియని ఈ కొత్త నన్ను నాకు త్వరగా పరిచయం చేయవా,
ఓ నా ప్రేమ..

# రామ్..

మనిషి

నువ్వు ఏడిచే ఏడుపులో, బాధ ఉండాలి
నవ్వే నవ్వులో సంతోషం ఉండాలి
గెలిచిన గెలుపులో కష్టం ఉండాలి
ఇచ్చే మాటలో నిజాయితీ ఉండాలి

ఇవీ మనిషిలో ఉన్న మనిషికి నిర్వచనం..

# రామ్..

విడవకు

బాధ అంటే కళ్ళలో నీళ్లు కాదు,
సంతోషం అంటే బుగ్గల్లో బరువు కాదు,
Eyes are index of your heart

గుండెలో ఉన్న ఆ బాధ, సంతోషం .. కళ్ళలోనే కనిపిస్తాయి
ఆ రెంటిని కనిపెట్టే, కళ్ళు దొరికినపుడు.. ఆ చేయిని వదలొద్దు..

# రామ్..

Saturday 3 November 2018

క్షమించు



నన్ను మన్నించు !! నన్ను మన్నించు !!

నీ నవ్వుతో నను స్వాగతించిన ఓ ప్రేమ,
నీ చూపుతో నను పలకరించిన ఓ భామ,
అందుకోమని హారతి ఇచ్చితివా నీ ఈ ప్రేమ,
అద్దుకునేలోపే ఆవిరయితివా నా రమా,
నా ఆలస్యాన్ని మన్నించు, ఈ నిర్లక్ష్యాన్ని క్షమించు,
మళ్ళీ నీతో నను దీవించు..

రామ్..