నన్నే నాకు కొత్తగా పరిచయం చేశావే, నా ప్రేమ
ఈ కొత్త నేను నాకు చాలా బాగా నచ్చింది
ఇంకేముందే నాలో, నాకే తెలియని ఈ కొత్త నన్ను నాకు త్వరగా పరిచయం చేయవా,
ఓ నా ప్రేమ..
నీ నవ్వుతో నను స్వాగతించిన ఓ ప్రేమ,
నీ చూపుతో నను పలకరించిన ఓ భామ,
అందుకోమని హారతి ఇచ్చితివా నీ ఈ ప్రేమ,
అద్దుకునేలోపే ఆవిరయితివా నా రమా,
నా ఆలస్యాన్ని మన్నించు, ఈ నిర్లక్ష్యాన్ని క్షమించు,
మళ్ళీ నీతో నను దీవించు..